గంగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో 5, 10, 16 సంవత్సరాల పిల్లలకు DPT బూస్టర్ టీకాలు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని అర్హులైన పిల్లలకు DPT బూస్టర్ టీకాలు అందించారు. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా పలు వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రభుత్వం సూచించిన వయస్సుల ప్రకారం అవసరమైన టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ZPHS హెడ్మాస్టర్ బాలకృష్ణారెడ్డి, డాక్టర్ తేజస్విని (MLHP), జాకియా బేగం (2వ ANM), ఆశా కార్యకర్తలు నాగజాత, వసంత, రామానుజ, కృష్ణమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


