బల్మూర్: చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని అచ్చంపేట ఎమ్మెల్యే, TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బల్మూర్ మండలం గట్టుతుమ్మన్ గ్రామంలో ICDS ఆధ్వర్యంలో 3 నుంచి 6 సంవత్సరాల అంగన్వాడీ చిన్నారులకు నిర్వహించిన “తొలిముద్ద” అల్పాహార పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉప్మా, కిచిడీ తదితర పోషకాహారాన్ని పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.


