నాగర్‌కర్నూల్ జిల్లా: ప్రతినిధి ఆవంచ సాల్వాచారి (తొలి కిరణం న్యూస్)
అచ్చంపేట సబ్‌డివిజనల్ పోలీస్ కార్యాలయం, సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్లో నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ.. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శకంగా విచారణ చేపట్టి సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సకాలంలో సహాయం అందేలా కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని సూచించారు.
స్థానిక రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రిసెప్షన్, రైటర్‌తో పాటు ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో రికార్డుల భద్రత, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరును అభినందించారు.
ఈ వార్షిక తనిఖీలో అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రయ్య, డీసీఆర్బీ ఎస్సై రమేష్, అచ్చంపేట ఎస్సై నరేష్, సిద్ధాపూర్ ఎస్సై అంజయ్య తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

