తెలకపల్లి: మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో SIR–2026 ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా BLOలు, BLO సూపర్వైజర్లు, GPOలకు సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SIR ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఆగస్టు 17న SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లు, విధివిధానాలను BLOలకు వివరించారు. అలాగే ASD (Absent, Shifted, Dead) ఓటర్లు, లాజికల్ ఎర్రర్స్, డిస్క్రెపెన్సీలకు సంబంధించిన నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. నోటీసులు అందించిన అనంతరం వాటి పంపిణీ వివరాలను BLO యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిన విధానాన్ని వివరించారు. ప్రతి దశను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి తహసీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షత వహించగా, ఎంపీడీవో వెంకట్, డీటీ లక్ష్మణ్ మాస్టర్ ట్రైనర్లుగా పాల్గొని BLOలు, సూపర్వైజర్లకు SIR–2026 ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, BLOలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


