హైదరాబాద్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేస్తున్న కృషి అభినందనీయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
రసూల్పురలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు సభల్లో భాగంగా గన్బజార్ కమ్యూనిటీ హాల్లో జరిగిన 2వ వార్డు సభకు ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడంలో BLOలు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఓటర్ జాబితాలో పేరు లేని వారికి SIR ప్రక్రియపై అవగాహన కల్పించాలని BLOలకు సూచించారు. అలాగే నోటీసులు అందుకున్న వారికి ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని, SIRపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.
BLOలకు రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, BLO సూపర్వైజర్లు, BLAలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



