నాగర్‌కర్నూల్: రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని తాడూర్, బిజినపల్లి మండలాల్లో రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు.
తాడూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు స్ప్రింక్లర్ పైపులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అందజేశారు. అనంతరం బిజినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలోనూ రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ప్రింక్లర్ పైపుల వినియోగం ద్వారా సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు తక్కువ నీటితో సమర్థవంతంగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగానికి అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
రైతులు ఆధునిక సాగు పద్ధతులను వినియోగించుకొని నీటిని పొదుపు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే సూచించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):

