మల్కాజిగిరి: నేరేడ్మెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక RAMP పథకం ఆధ్వర్యంలో MSME పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలు, రాయితీలు, అవకాశాలు, ప్రభుత్వ సహాయంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించారు. స్థానికంగా ఉన్న MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడం, యువతకు స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో అవకాశాలు కల్పించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
RAMP పథకం పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ni-msme), జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
MSMEలకు అవసరమైన సమాచారం, సాంకేతిక మార్గదర్శకత్వం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టితో పాటు మల్కాజిగిరి నియోజకవర్గ స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడటమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ni-msme సంచాలకులు సూర్య ప్రకాష్ గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు జయంతి, సహాయ అధ్యాపకులు తేజేశ్వర్ రావు, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్, BRS నాయకులు బద్దం పరశురామ్ రెడ్డి, GK హనుమంతు రావు, JAC వెంకన్న, డోలి రమేష్, శ్రీధర్ గౌడ్, రాము యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కన్నబాబు, EDC సిబ్బంది, బ్యాంకర్లు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
యువత శివ సాయి యాదవ్, నిర్ణీత్ రెడ్డి, సాయి గౌడ్, సుమన్ గౌడ్, నిఖిల్, శరత్ గౌడ్, రాజేష్ గౌడ్, విజయ్ రెడ్డి, అద్విత్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


