తాడూరు, సెప్టెంబర్ 18: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం, విద్యా హక్కుల సాధన లక్ష్యంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) కమిటీల నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోందని MSF ఉమ్మడి జిల్లా ఇంచార్జి బుక్కపురం మహేష్ మాదిగ తెలిపారు.
తాడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన MSF కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, హక్కులు, అవకాశాలు కల్పించే సమసమాజ నిర్మాణానికి విద్యార్థులు కృషి చేయాలని అన్నారు.
అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థుల జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో దాని ఫలాలను అందుకోవడంలో మాదిగ విద్యార్థులు ముందువరుసలో ఉండాలని పేర్కొన్నారు.
ఆర్థిక, రాజకీయ, సామాజిక, లింగ సమానత్వం సాధించేందుకు విద్యార్థులు చైతన్యంతో పనిచేయాలని, మహనీయులు కలలు కన్న సమానత్వ సమాజ స్థాపన దిశగా ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని అన్నారు.
MSFను గ్రామ, మండల, జిల్లా, కళాశాల, యూనివర్సిటీ స్థాయిలో మరింత బలోపేతం చేయడంలో భాగంగా కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు మహేష్ మాదిగ తెలిపారు.
తాడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల MSF కమిటీ
అధ్యక్షుడు: వాడల రామ్ చరణ్
వర్కింగ్ ప్రెసిడెంట్: లోకేశ్
అధికార ప్రతినిధి: బి. రూప
ఉపాధ్యక్షులు: రాకేష్, లక్ష్మీ, శివాని
ప్రధాన కార్యదర్శి: భాను
కార్యదర్శులు: నందిని, అనిత
ప్రచార కార్యదర్శి: స్నేహ
ఇతర విద్యార్థులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కావాలి అనిల్ కుమార్, MSF జిల్లా నాయకులు, ఇతర నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


