రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ సమీపంలో KSUF 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి KSUF నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కార్యక్రమంలో KSUF అధ్యక్షులు బండారు మల్లికార్జున, వైస్ ప్రెసిడెంట్ హస్తి భరత్ రాజు, ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు శ్రీధర్తో పాటు పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


