నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డులో మైల్స్టోన్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యత ఎంతో కీలకమని, యువత దేశాభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేశారు. 30 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ఆరోగ్యపరంగా ఆసరాగా నిలిచిన ధన్నోజు వీరేష్ కూడా ఈ సందర్భంగా రక్తదానం చేశారు.
మైల్స్టోన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. నరేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఈ మహోత్తర కార్యక్రమానికి అండగా నిలుస్తున్న పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైల్స్టోన్ యూత్ సభ్యులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి యువత ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రాగి శ్రవణ్, తిరుపతి, గారి సూర్య, డాక్టర్ మణి, పాత తేజవర్ధన్ రెడ్డి, ఆవుల వంశీ, పట్నం శివ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


