పాలెం, సెప్టెంబర్ 29: పాలెం అంగన్వాడీ కేంద్రంలో AWT (అంగన్వాడీ టీచర్) పోస్టుకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా CDPO శోభారాణి ఆధ్వర్యంలో సూపర్వైజర్లు లక్ష్మీదేవి, రేణుకాదేవి, పద్మావతి, లక్ష్మీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ శివకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


