పాలెం, తొలి కిరణం న్యూస్:
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి, భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతత, సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి వ్రతాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఓం నమో వేంకటేశాయ నమః!
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


