తొలి కిరణం దినపత్రిక | నాగర్‌కర్నూల్ జిల్లా:
వంగూరు మండలం జాజాల గ్రామ పరిధిలోని దుందుభి వాగు నుంచి ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానిక రైతులు అధికారులను కోరారు. ఇప్పటికే ఏమైనా అనుమతులు జారీ చేసి ఉంటే వాటిని తక్షణమే రద్దు చేయాలని స్థానిక తహసీల్దార్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
దుందుభి వాగు నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు ఇస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామంలోని ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తడంతో పాటు వ్యవసాయానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇసుక రవాణాకు అనుమతులు యథావిధిగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు రైతులు తెలిపారు.
దుందుభి వాగు గ్రామ ప్రజలకు, రైతులకు నీటి వనరుగా ఉందని, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా అధికారులు స్పందించి ఇసుక రవాణా అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


