పుల్లంపేట, ( తొలి కిరణం ) నవంబర్ 22న
తిరుపతి జిల్లా పుల్లంపేట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు కేశినేని నారాయణ నాయుడు శనివారం మృతి చెందడంతో మండల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల రైల్వే కోడూర్ టిడిపి ఇన్చార్జ్ కూడా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి & వారి సతీమణి ముక్క వరలక్ష్మి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు విశేష కృషి చేసిన నారాయణ నాయుడు మరణం పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


