కొల్లాపూర్ (తొలి కిరణం): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో చదవడం లేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థి పవన్‌కుమార్‌పై ఉపాధ్యాయుడు సతీష్ బెత్తంతో దాడి చేయడం బాధాకరమని బంజారా విద్యార్థి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ అన్నారు.
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని శివనాయక్, టీజీవీపీ రవి యాదవ్ విద్యార్థులతో కలిసి పరామర్శించారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శివనాయక్ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే విద్యార్థిపై ఈ విధంగా దాడి చేయడం ఆందోళనకరమన్నారు. పాఠశాలలు విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలుగా ఉండాలే తప్ప విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రదేశాలుగా మారకూడదన్నారు. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శారీరకంగా హింసించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శివనాయక్, టీజీవీపీ రవి యాదవ్ కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



