చిట్వేల్ (తొలి కిరణం) నవంబర్ 16:
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
గత 40 సంవత్సరాలుగా చౌడవరం కుటుంబానికి రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆ కుటుంబం నిరంతరం సేవలందిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే వ్యక్తిగా ఉమామహేశ్వర్ రెడ్డికి గుర్తింపు ఉందని తెలిపారు.
గతంలో పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు, ప్రజల సమస్యల్లో తనవంతు సహకారం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా నిలిచారని వివరించారు. ముఖ్యంగా చిట్వేల్ ప్రాంతంలో బస్టాండ్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చౌడవరం కుటుంబం విశాల హృదయంతో తమ సొంత స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం అందించిందని గుర్తుచేశారు. అదేవిధంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాల నిర్మాణానికి సైతం ఆ కుటుంబం గణనీయమైన స్థలాన్ని సమకూర్చిందని తెలిపారు.
ఈ సేవలను గుర్తుచేసుకుంటూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఉమామహేశ్వర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామ ప్రజలు కలిసి ఎన్నికల బరిలో అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


