ఓబులవారిపల్లె (తొలికిరణం), నవంబర్ 16:
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండల పరిధిలోని చిన్న ఓరంపాడు గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి నాగేళ్ల పిచ్చయ్య పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఓబులవారిపల్లె సచివాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆశీస్సులతో, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు, అభిమానుల భారీ సమూహం నడుమ గ్రామం నుంచి నామినేషన్ కార్యక్రమానికి ఐక్యంగా బయలుదేరనున్నట్లు నాగేళ్ల పిచ్చయ్య తెలిపారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తనకు ఆశీస్సులు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


