తొలికిరణం, నవంబర్ 12, మేడిపల్లి ప్రతినిధి:
మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన తిరుమల్ రావుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును అందజేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ సహకారంతో మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారులకు చేరవేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుని, అవసరమైన సమయంలో స్పందించి సేవలందించడమే తమ లక్ష్యమని తుంగతుర్తి రవి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నరిగే సతీష్, కొమ్ము బంగారయ్య, అక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


