మేడిపల్లి, నవంబర్ 12 (తొలికిరణం):
మేడిపల్లి డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పర్వతాపూర్, గాంధీనగర్లోని గాంధీ విగ్రహం వద్ద శిథిలావస్థకు చేరిన పాత విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను పరిశీలించారు. ఎలక్ట్రికల్ ఏఈ సహకారంతో చేపట్టిన ఈ పనులతో స్థానికులకు విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యాసారం నాగేష్, ప్రధాన కార్యదర్శి ముదిగొండ రమేష్, విద్యుత్ శాఖ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
అదేవిధంగా మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై స్థానికుల విజ్ఞప్తి మేరకు డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సమస్యలపై జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ కమిషనర్ శైలజ, తుంగతుర్తి రవి కలిసి ధరణి కాలనీలో పర్యటించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్ శైలజ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఏఈ సాయి కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ లింగస్వామి, ధరణి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తుంగతుర్తి రవి స్పష్టం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


