తొలికిరణం నవంబర్ 12, పాలెం ప్రతినిధి:
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో గ్రామాభివృద్ధి పనులకు వేగం పెంచారు. గ్రామంలోని 7వ వార్డులో గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులను గురువారం గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాలనీలో శిథిలావస్థకు చేరిన మురికి కాలువల కారణంగా స్థానికులు దుర్గంధం, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని అండర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
గ్రామాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పాలెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ, మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు దండు అరుణ, శంకర్, గోవిందు కాశన్న, వష్పరి శివ, నాగులు, దొంతరమోని పరశురాములు, గ్రామ నాయకులు గోవింద శేఖర్, టమటం జయకృష్ణ గౌడ్, బోనాసి కురుమయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు కృష్ణవేణి, బోనాసి శేఖర్, చింతల నరసింహ, దుగ్యాని బీరయ్య, వట్టెపు శివకుమార్, బుచ్చయ్య, రవికుమార్, శివారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



