తొలి కిరణం | నవంబర్ 10 | ఘట్కేసర్ ప్రతినిధి
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ బస్టాండ్లో నీటి సరఫరా లేకపోవడంతో మరుగుదొడ్లకు తాళాలు వేసిన సిబ్బంది, “నీళ్లు లేవు.. రేపు రాగలరు” అంటూ బోర్డు ఏర్పాటు చేయడం ప్రయాణికుల ఇబ్బందులకు అద్దం పడుతోంది.
నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఘట్కేసర్ బస్టాండ్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారు మరుగుదొడ్లు మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరుగుదొడ్ల పరిస్థితి ఇలా ఉంటే, కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడం ప్రయాణికులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది.
ప్రజా రవాణాలో కీలకమైన బస్టాండ్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించి, మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



