తొలి కిరణం న్యూస్ – బిజినపల్లి ప్రతినిధి:
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని ప్రసిద్ధ కేతురుబండ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
గంగారం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న తండాల వాసులు కలిసి అమావాస్య సందర్భంగా రాత్రంతా నిద్రాజాగరణ చేస్తూ స్వామివారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
అన్నదాత ఆంగోత్ శ్రీనివాసులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని కేతురుబండ ఆంజనేయ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సందడితో దేవస్థాన పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఈ అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో విజయవంతంగా ముగిసింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


