మేడ్చల్ జిల్లాలో ఘట్కేసర్ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డకు ప్రాణాపాయం తప్పించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు సకాలంలో స్పందించి ఇద్దరినీ సురక్షితంగా రక్షించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేట్ వద్ద ఓ మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పెట్రోల్-2 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న తల్లీబిడ్డను చాకచక్యంగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రమాదం నుంచి కాపాడారు.
పోలీసుల విచారణలో భర్త వేధింపుల కారణంగా మహిళ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఆమె సోదరి వద్దకు అప్పగించారు.రెండు నిండు ప్రాణాలను కాపాడిన పెట్రోల్-2 ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ పరమేష్‌తో పాటు విధుల్లో ఉన్న సిబ్బందిని ఘట్కేసర్ ఎస్హెచ్ఓ కిరణ్ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
సమయానికి స్పందన.. రెండు ప్రాణాలకు రక్షణ!
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


