పోలీసుల వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన బొంత సారిత కుమార్తె మమత (26)కు కామారెడ్డికి చెందిన కుంచపు పోచయ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత ఐదు నెలలుగా మమత తన పుట్టింటి వద్దే ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది.
ఈ క్రమంలో నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం నుంచి మమతతో పాటు ఆమె పిల్లలు కృప శైత్య (6), జోహన్ వెస్లీ (4), జోసెఫ్ (3) కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఇంట్లో వెతకగా.. "పిల్లలను నేనే చదివించుకుంటా.. నా కోసం వెతకవద్దు" అని రాసిన లేఖ కనిపించింది.
దీంతో ఆందోళనకు గురైన తల్లి సారిత ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తల్లి, ముగ్గురు పిల్లల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.
ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి
మమత, ఆమె ముగ్గురు పిల్లల ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్లో లేదా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నంబర్ 8712662705కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


