అతినారపు కిరణ్ కుమార్ (తొలికిరణం ప్రతినిధి)
నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువులు, కళాశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించేందుకు అవసరమైన సహకారం అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, చదువుపై ఆసక్తిని కలిగించేందుకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


