నారాయణపేట, నవంబర్ 3 (తొలి కిరణం న్యూస్): నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నారాయణపేట పట్టణంలోని సింగారం గేట్ వద్ద టాస్క్‌ఫోర్స్, టౌన్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, సరైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు.
పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన టిప్పర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్లను విచారించారు. పట్టుబడిన టిప్పర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆనంద్, తండ్రి సిద్ధప్ప – కొంకల్ గ్రామం, యాద్గిర్ జిల్లా, కర్ణాటక. టిప్పర్ నంబర్: KA52N2882.
వల్లంపల్లి రాజు, తండ్రి బసప్ప – శాసన్‌పల్లి గ్రామం, నారాయణపేట మండలం. టిప్పర్ నంబర్: KA33A7902.
జె. రఘువీర్, తండ్రి అశోక్ గౌడ్ – తిప్రాస్‌పల్లి గ్రామం, ఉట్కూర్ మండలం. టిప్పర్ నంబర్: TG38T3123.
బోయ శివ, తండ్రి హన్మంతు – జాజాపూర్ గ్రామం, నారాయణపేట మండలం. టిప్పర్ నంబర్: TG38T4149.
ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నామని, సంబంధిత డ్రైవర్లు, వాహన యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


