రాజంపేట, అక్టోబర్ 27 (తొలి కిరణం ప్రతినిధి):
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన సండ్రపల్లె వెంకటరమణ టీడీపీ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవ ఎన్నికతో మండలంలో టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో పాటు, పార్టీ సిద్ధాంతాల పట్ల అంకితభావంతో సండ్రపల్లె వెంకటరమణ నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు గ్రామస్థుల్లో మంచి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఈ సందర్భంగా సండ్రపల్లె వెంకటరమణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఒంటిమిట్ట మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, గ్రామస్థులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి వెన్నంటే ఉండి, సాధ్యమైనంతవరకు సహాయం చేస్తూ సేవలందిస్తానని హామీ ఇచ్చారు.
దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణతో లభించిన ఈ విజయానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తానని సండ్రపల్లె వెంకటరమణ పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


