బిజినపల్లి, తొలి కిరణం న్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలానికి చెందిన గోవిందు జయప్రకాష్‌ను భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) మండల కాలేజీల కన్వీనర్‌గా ఎంపిక చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేవైఎం మండల అధ్యక్షుడు సంతోష్‌కు, మండల టీమ్ సభ్యులకు గోవిందు జయప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కళాశాల విద్యార్థులతో సమన్వయం చేసుకుంటూ యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. తన ఎంపికకు సహకరించిన బీజేవైఎం నాయకులకు, కార్యకర్తలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


