పాలెం, తొలి కిరణం న్యూస్: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ అక్టోబర్ 24 నుంచి ప్రతి శనివారం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారి పల్లకి సేవ నిర్వహించనున్నారు.
ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పాలెం వెంకన్న స్వామి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా విరాజిల్లుతున్న నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.
గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలని నిర్వాహకులు సూచించారు. గిరిప్రదక్షిణ అనంతరం నిర్వహించే పల్లకి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
పాలెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గిరిప్రదక్షిణ, పల్లకి సేవలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


