లక్నారం (తొలి కిరణం న్యూస్): జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ MPHS లక్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, చదువుపై ఆసక్తిని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పాఠశాల సిబ్బంది తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


