తొలి కిరణం న్యూస్, గంగారం: నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో శ్రీ దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి బిజినపల్లి ఎస్ఐ షంషుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి నీళ్ల సాయమ్మ–నీల ఆంజనేయులు, ఉపనమోని లక్ష్మమ్మ–రామచంద్రయ్య, గుళ్ల మనీషా–మన్యం, దుబ్బల అరుణ–గోవర్ధన్, ఎండి షబానా, దేవునికాడి భాగ్యమ్మ–శ్రీనివాసులు అన్నదాతలుగా వ్యవహరించారు.
శ్రీ దుర్గా భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, ఐక్యతను పెంపొందిస్తాయని పలువురు పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



