నాగర్‌కర్నూల్ జిల్లా, అక్టోబర్ 21 (తొలి కిరణం): బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానం నుంచి స్వామివారు బయలుదేరి జమ్మి వృక్షం వద్దకు చేరుకున్నారు. అక్కడ గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో జమ్మి వేడుకలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు సీతారామ లక్ష్మణస్వాములను దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామివారిని వేడుకున్నారు.
గ్రామ సర్పంచ్ ఉపనమోని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జమ్మి వేడుకల్లో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని విజయదశమి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


