పోలేపల్లి అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తా
నాగర్ కర్నూల్ జిల్లా, అక్టోబర్ 19 (తొలికిరణం న్యూస్): బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామపంచాయతీ భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. పోలేపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలేపల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి మాధవి నరసింహ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గుబ్బ సంధ్య, భాను ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటరెడ్డి, ముల్గర మహేందర్, మూడవతు హనుమే నాయక్, ఏడు దొడ్ల రాంరెడ్డి, పోతాల రామల్లేష్, మూడవతు కృష్ణ నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


