నాగర్కర్నూల్ జిల్లా: రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా నాగర్కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, తెలకపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.
వేసవికాలంలో పంటలు వేయవద్దని రైతులకు సూచిస్తున్న ప్రభుత్వం, ముందస్తుగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలను ఎందుకు సిద్ధం చేయలేదని వారు ప్రశ్నించారు. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంటలు వేయవద్దని చెప్పడం సమస్యకు పరిష్కారం కాదని, రైతులకు ముందుగానే స్పష్టమైన ప్రణాళిక ప్రకటించి, సాగునీరు మరియు నిరంతర విద్యుత్ సరఫరాపై భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈర్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, రైతుల కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలకపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


