నాగర్‌కర్నూల్ జిల్లా, అక్టోబర్ 18 (తొలి కిరణం న్యూస్): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి సూపర్ మార్కెట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థ మంచి అభివృద్ధి సాధించాలని, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందుతూ ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిజినపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మాజీ సర్పంచ్‌లు గగనమోని తిరుపతయ్య, అవంతి శంకర్, ఎస్టీ నాయకులు గోవిందు, ప్రేమ్ నాయక్, హరీశ్వర్ రెడ్డి, మస్కూరు బంగారయ్య, మెట్టుపల్లి మాజీ ఎంపీటీసీ చంద్ర గౌడ్, అమృత్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


