ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం
చిట్వేల్, అక్టోబర్ 16 (తొలి కిరణం న్యూస్): రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మళ్లీ శెట్టి వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం పుంగనూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్న ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి జరగడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ సందర్భంగా మళ్లీ శెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులపైనే ఇలాంటి దాడులు జరిగితే సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై దాడులకు తావుండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
— తొలి కిరణం న్యూస్, చిట్వేల్
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


