బ్రేకింగ్ న్యూస్,
చిట్వేల్, అక్టోబర్ 16 (తొలి కిరణం న్యూస్): తిరుపతి జిల్లా చిట్వేల్ మండల పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్వేల్ నుంచి గరుగుబల్లి వెళ్లే మార్గంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉదయం 11 గంటల ప్రాంతంలో లారీ కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.వివరాల్లోకి వెళ్తే.. దొగ్గలపాడు గ్రామానికి చెందిన ముర్రి పెంచలయ్య కుమారుడు యానాదయ్య ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హిటాచీ యంత్రంతో వెళ్తున్న ఏపీ 16 టీహెచ్ 0299 నంబరు గల లారీ కిందపడి ఆయన మృతిచెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు మృతదేహం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జు కావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


