నాగర్కర్నూల్, అక్టోబర్ 13 (తొలి కిరణం న్యూస్): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బుధవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఉపముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బందోబస్తు విధులకు కేటాయించిన సిబ్బంది తమకు నిర్దేశించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. వీఐపీ పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. భద్రతా విధుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.
ఈ భద్రతా సమీక్షలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు చంద్రయ్య, నాగరాజ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


