నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో శ్రీ దుర్గా మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో గుంటి చెన్నయ్య, గుంటి లక్ష్మమ్మ దంపతుల కుమారుడు గుంటి జగదీష్, లక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):


