శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్ఆంధ్రప్రదేశ్దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి
ఆంధ్రప్రదేశ్తాజా కథనం

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి
ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి
KALI CHINNAIAH
KALI CHINNAIAH
రిపోర్టర్
2026-10-14
4 నిమిషాల పఠనం
44 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

రైల్వే కోడూరు, అక్టోబర్ 13 (తొలి కిరణం న్యూస్): దసరా శరన్నవరాత్రుల సందర్భంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం ఎస్. ఉప్పరపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న వారు అమ్మవారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎస్. ఉప్పరపల్లి గ్రామ ప్రజలపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాధవరం పోడు గ్రామ మాజీ సర్పంచ్ కంచిరాజు రామరాజు, కొలవల సుబ్బరామిరెడ్డి, కోడూరు శేఖర్, బోట్ల వెంకట్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, ఎర్రగుంట్ల ముని పెంచల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బోట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోనిరెడ్డి రామ సుబ్బారెడ్డి, లక్కిరెడ్డి గోపాల్ రెడ్డి, వీసం భాస్కర్ రెడ్డి, వాగేటి చంగల్ రెడ్డితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#ఆంధ్రాప్రదేశ్#అనంతపూర్#అభివృద్ధి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి