నాగర్కర్నూల్, అక్టోబర్ 13 (తొలి కిరణం న్యూస్): నాగర్కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు మడ్డి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత ప్రజలకు మరింత చేరువ కావాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తిరుపతి గౌడ్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అసెంబ్లీ ఇన్చార్జి అజయ్, జిల్లా జనరల్ సెక్రటరీ నాని గౌడ్, మండల అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షుడు నల్లగంటి రాము, బిజినపల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్, తెలకపల్లి మండల అధ్యక్షుడు రెనాయ్య, మాజీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


