నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) అమలులో నాగర్‌కర్నూల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని ఎన్ఎస్సీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి మైలురాయి వేడుకల్లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
పథకం అమలులో ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి నలుగురు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం హాజరైంది. ఈ బృందంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త ఓ. శైలా, ప్రగతిశీల రైతు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ అవార్డుతో వ్యవసాయ రంగంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయింది.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):



