నాగర్కర్నూల్, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పంపించి, వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


