రాజంపేట, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): కడప జిల్లా రాజంపేట సబ్ డివిజన్ నూతన పోలీసు డీఎస్పీగా బి. వెంకట్రామయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి రాజంపేటకు బదిలీపై వచ్చారు.
సోమవారం ఉదయం రాజంపేట డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన డీఎస్పీకి స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎస్పీ బి. వెంకట్రామయ్య మాట్లాడుతూ, రాజంపేట సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


