మల్కాజిగిరి, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి, నేరేడ్మెట్, గౌతమ్‌నగర్ డివిజన్లలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మర్రి మమతా రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల వద్ద భక్తులు, స్థానిక మహిళలు, యువకులు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నిరుగొండ జగదీష్ గౌడ్, మంజుల, మేకల సునీత, రాము యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు జీకే హనుమంతరావు, జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, ప్రభాకర్ గౌడ్, కేబుల్ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ రావు, నర్సింగ్ రావు, శివ గౌడ్, సాయి గౌడ్, షా శంకర్రావు, శ్రీనివాస్, రఘుపతి రెడ్డి, కిట్టు, శ్రీరాములు, మాసెట్టి అనిల్, అభిషేక్, రాజేష్ గౌడ్, అవినాష్, జంగరాజు, విజయ రెడ్డి, అశ్వైద్ రెడ్డి, ప్రవీణ్, నవీన్, మధు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


