మౌలాలి, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మౌలాలి ప్రాంతంలో మౌలాలి మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు షకీల్ ఆధ్వర్యంలో గ్యార్వీ ఉర్సే షరీఫ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీ-బ్లాక్ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు ఉర్సే షరీఫ్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, జనరల్ సెక్రటరీ సలీం, సీనియర్ నాయకులు చంద్రకాంత్, నరసింహ, జగదీష్, అత్తర్, మల్కాజిగిరి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, లక్ష్మణ్, సాయి తదితర కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


