సుభాష్‌నగర్‌లోని ప్రాథమిక చికిత్స కేంద్రం, ఇందిరానగర్‌లోని బస్తీ దవాఖానను వైద్యులు, సిబ్బంది ఆహ్వానం మేరకు సంజీవ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో కనీస వసతుల కొరతతో ఎదురవుతున్న ఇబ్బందులను సిబ్బంది ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోగులకు అందించే మందులు, వైద్య పరీక్షల నివేదికలను భద్రపరిచేందుకు బీరువాలు లేవని, మహిళా సిబ్బందికి వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.
సిబ్బంది సమస్యలపై స్పందించిన సంజీవ్ కుమార్, వాటిని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తక్షణ అవసరాన్ని గుర్తించి సుభాష్‌నగర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి రెండు బీరువాలు, ఇందిరానగర్ బస్తీ దవాఖానకు ఒక బీరువాను తన వంతు సహాయంగా విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో 195వ డివిజన్ అధ్యక్షుడు పి. సుదేశ్ చంద్, సీనియర్ నాయకులు శివకుమార్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ నాయకుడు చిత్రాల సంతోష్ సాగర్, బాలకృష్ణ రెడ్డి (కిట్టు), సాయికుమార్, డివిజన్ ఉపాధ్యక్షుడు పి.బి. రాజకుమార్, ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, లింగంపల్లి ముత్యాలు, ఉప్పు కుమార్, మక్కా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులు నూరైన్, శివాని, సిబ్బంది జీవిత, శ్రీలత, మమత, సుమలత, ఆశా వర్కర్లు ఉమ, గంగ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


