తొలి కిరణం న్యూస్, కోడూరు, అక్టోబర్ 12: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ కేంద్రంలో బోలా శంకర్ సేనా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహార విందు నిర్వహించారు. సమితి మండల అధ్యక్షుడు మండల నాగేంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయం అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నట్లు సభ్యులు తెలిపారు. బోలా శంకరుని ఆశీస్సులతో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టి రమేష్, రత్నయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. పరమశివుని ఆశీస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సభ్యులు తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


