నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (తొలి కిరణం న్యూస్): దసరా పండుగను పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ మినీ ట్యాంక్ బండ్‌పై చేపట్టిన శుభ్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పరిశీలించారు. పండుగ సందర్భంగా ట్యాంక్ బండ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సూచించారు.
ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పండుగకు వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


