నకిరేకల్ (నోముల), అక్టోబర్ 12: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన శ్రీ శ్రీనివాస కిరణ్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 20వ వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ వివిధ రూపాల్లో అలంకరిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహిస్తూ గ్రామంలో భక్తి భావాన్ని, ఐక్యతను చాటుతున్న శ్రీ శ్రీనివాస కిరణ్ యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస కిరణ్ యూత్ అధ్యక్షుడు యానాల జానారెడ్డి, ఉపాధ్యక్షుడు తేలు రాజేష్, కార్యదర్శి కందాల నర్సిరెడ్డి, కోశాధికారి సామ మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి యానాల జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


